పాలస్తీనాకు అనుకూలంగా మాట్లాడుతూ సొంత దేశ పోలీసులను తిట్టిన బ్రిటన్ మంత్రి(Britan Minister)ని ఆ దేశ ప్రధాని రిషి సునాక్ తొలగించారు. సుయెల్లా బ్రేవర్మన్ పై తీవ్రంగా మండిపడ్డ సునాక్.. ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. కేబినెట్ నుంచి బ్రేవర్మన్ వైదొలిగారని, ఆమె స్థానంలో జేమ్స్ క్లెవర్లీ బాధ్యతలు చేపడుతున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. గోవా నుంచి వెళ్లి స్థిరపడ్డ 43 సంవత్సరాల సుయెల్లా ఇజ్రాయెల్-గాజా యుద్ధంపై హాట్ కామెంట్స్ చేశారు. బ్రిటన్ పోలీసులు ఇజ్రాయెల్ దేశస్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మాట్లాడటంతో దేశంలో తీవ్రంగా దుమారం రేగింది. దీంతో ఆమెను తొలగించాలంటూ రిషి సునాక్ పై ఒత్తిడి పెరిగింది.
‘మన పోలీసులు ప్రతి ఒక్క పౌరుడి నుంచి కృతజ్ఞతలు అందుకోవడానికి అర్హులు.. ఎందుకంటే ప్రొఫెషనల్ గా ధర్నా చేసిన వారి పట్ల ఇష్టానుసారంగా ప్రవర్తించారు.. ఒక మంచి పోరాటం చేస్తున్న వ్యక్తులను అణచివేయాలని చూశారు’ అంటూ ఆదివారం నాడు పాలస్తీనా అనుకూల వాఖ్యలు చేశారు. అయితే ఈ ఘటనలో ఇజ్రాయెల్-పాలస్తీనా మద్దతుదారుల ఆందోళనను అడ్డుకునేందుకు వెళ్లిన పలువురు పోలీసులు గాయాలపాలయ్యారు. ఒక మంత్రిగా ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడమేంటంటూ బ్రిటన్(United Kingdom)లోని 5 ప్రధాన పార్టీలు సునాక్ సర్కారుపై ఎదురుదాడికి దిగాయి.