మొబైల్ ఫోన్ల వాడకం రోజురోజుకూ ఎలా పెరిగిపోతున్నదో చూస్తూనే ఉన్నాం. 3జీ, 4జీ, 5జీ ఇలా జనరేషన్ లు మారిన కొద్దీ ఫోన్ల వాడకం అంతకంతకూ రెట్టింపవుతున్నది. ఇళ్లు, ఆఫీసుల సంగతి అటుంచితే స్కూల్ కెళ్లే చిన్నారులు సైతం మొబైల్ ఫోన్లను వాడుతున్నారంటే ఆశ్చర్యం లేదని చెప్పాలి. అప్పుడే బడిబాట పట్టే బుడ్డోడు సైతం యూట్యూబ్ లో వీడియోలు చూపిస్తే తప్ప ముద్ద నోట్లో పెట్టే పరిస్థితి లేని కాలమిది. ప్రైమరీ స్కూళ్ల సంగతి పక్కనపెడితే ఉన్నత పాఠశాలలు(High Schools), కళాశాల(Colleges)ల్లో మొబైల్ ఫోన్ల జాఢ్యం ఎక్కువవుతున్నది. దీన్ని నివారించడం ఫ్యూచర్ లో కష్టసాధ్యంగా మారే ప్రమాదమూ పొంచి ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితిని ముందే పసిగట్టిన ఆ దేశం.. బడుల్లో సెల్ ఫోన్లను నిషేధించింది.
బ్రిటన్ లో బ్యాన్…
బ్రిటన్ ప్రధానమంత్రి అయిన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్… ఈ సంచలన నిర్ణయం(Sensational Decision) తీసుకున్నారు. పాశ్చాత్య పోకడల(Western Culture)కు నిలయమైన బ్రిటన్ లో చిన్న పిల్లలు సైతం స్కూళ్లకు ఫోన్లు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. వీటి బారిన పడుతున్న చిన్నారులు.. చదువును పక్కనపెడుతున్నారని అక్కడి పరిశోధనల్లో తేల్చారు. ఇంకేముంది.. దీని విరుగుడుగుకు మందు కనిపెట్టినట్లుగా.. బడుల్లో మొబైల్ ఫోన్లను నిషేధిస్తూ సునాక్ సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకుంది.
వీడియో మెసేజ్…
పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న సెల్ ఫోన్లను బడుల్లో నిషేధిస్తున్నట్లు రిషి సునామ్.. ‘X’లో వీడియో మెసేజ్ ను షేర్ చేశారు. ఆయన వీడియో ఎలా ఉందంటే… ‘సునాక్ మాట్లాడుతున్న టైమ్ లో ఫోన్ మోగుతుంటుంది.. అలా పాకెట్లో పెట్టిన ప్రతిసారీ రింగ్ అవుతూనే ఉంటుంది. మూడోసారి దాన్ని చిరాకుగా తీసి ఇది వద్దు అంటూ పక్కనపెడతారు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్’. ఇలా అది ఎదిగే పిల్లలపై ప్రభావం చూపుతుందని చెప్పడానికి ఈ రకంగా చేసి చూపించారాయన.
బ్రిటన్ లో సెల్ ఫోన్లు తగ్గించిన తర్వాత మంచి ఫలితాలు(Good Results) రావడం గుర్తించారు. క్లాస్ రూముల్లోకి ఫోన్లు రాకుండా చూడాల్సిన బాధ్యతను అక్కడి హెడ్ మాస్టర్లకు కట్టబెట్టారు. విద్యాలయాల్లోకి సెల్ ఫోన్లు తీసుకురాకుండా వాటిని దాచేందుకు గల ప్రదేశాలు లేకుండా చేయడం, ఛార్జింగ్ పాయింట్లను తీసివేయడం వంటివి చేశారు.
యూరోపియన్ దేశాల్లోనూ…
బ్రిటన్ ఆచరిస్తున్న మొబైల్ కట్టడి విధానా(System)న్ని ఇతర యూరోపియన్ దేశాలు సైతం అనుసరించబోతున్నాయి. రిషి సునాక్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో బ్రిటన్ వ్యాప్తంగా స్కూళ్లల్లో మంచి ఫలితాలు వస్తున్నాయని గుర్తించిన పలు దేశాలు… ఇప్పుడు మొబైల్ బ్యాన్ ఉద్యమాన్ని తలకెత్తుకున్నాయి.
Good decision