రష్యాతో చమురు(Oil) వాణిజ్యం వల్ల 25% సుంకాలు విధించి ఇంకా పెంచుతామని బెదిరించినా.. అమెరికాకు భారత్ భయపడట్లేదు. ఆయిల్ వద్దంటూ రిపైనరీలకు మోదీ సర్కారు చెప్పకపోవడమే ఇందుకు ఉదాహరణ. కేంద్ర సంస్థలు, ప్రైవేటు రిఫైనరీలకు ఇప్పటివరకు ఎలాంటి సూచనలు వెళ్లలేదు. ఉక్రెయిన్ పై రష్యా దాడి(War) ఆపేందుకు భారత్ ను బెదిరించడమే ట్రంప్ అస్త్రం. అందుకే భారత ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’ అంటూ రెచ్చగొట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో.. స్వదేశీ వస్తువుల్నే వాడాలని మోదీ పిలుపునివ్వడం అమెరికాకు కౌంటర్ గా భావిస్తున్నారు. చైనా కన్నా అత్యంత ఆప్త మిత్రుడిగా ఇప్పుడు రష్యాకు భారత్ నిలిచింది. ఇక మోదీ సర్కారును బెదిరించే ప్లాన్ బెడిసికొట్టడంతో పుతిన్ ను దారికితెచ్చే మార్గాల్ని వెతుకుతున్నారు ట్రంప్.