రెండేళ్ల ఉక్రెయిన్ యుద్ధాన్ని(War) ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ప్రధాని మోదీ కోరారు. వార్ వల్ల ఎలాంటి పరిష్కారం దొరకలేదని తన రెండ్రోజుల రష్యా పర్యటన(Visit)లో భాగంగా మాస్కోలో జరిగిన భేటీలో గుర్తు చేశారు.
ప్రాదేశిక(Territorial), సమగ్రత, సౌభ్రాతృత్వం విషయంలో ఐరాస నిబంధనలకు కట్టుబడి ఉండాలని.. చర్చలు, దౌత్యమే తప్ప యుద్ధం వల్ల ప్రయోజనం లేదని తాము నమ్ముతున్నట్లు మోదీ చెప్పారు. దశాబ్ద కాలంలో ఈ ఇద్దరి మధ్య జరిగిన 16వ భేటీ ఇది.
ఉక్రెయిన్ యుద్ధానికి ముందు 2022లో ఉజ్బెకిస్థాన్‌లోని సమర్ఖండ్ లో జరిగిన షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో మోదీ-పుతిన్ మీటయ్యారు.
ఏజంట్ల మోసం వల్ల కొందరు భారతీయులు ఉక్రెయిన్ వెళ్లి చిక్కుకున్నారని మోదీ చెప్పడంతో.. వారందర్నీ సురక్షితంగా భారత్ తరలిస్తామని పుతిన్ మాట ఇచ్చారు.
పంజాబ్-హర్యానాకు చెందిన రెండు డజన్ల మంది ఉక్రెయిన్ తరఫున పోరాడుతున్న వీడియోలు ఈ ఏడాది ప్రారంభంలో సంచలనం రేపాయి.