
పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా మోదీతో కారులో దిగిన ఫొటో అమెరికాలో చిచ్చు రేపింది. ఈ ఒక్క ఫొటో ముందు వెయ్యి పదాలైనా సరిపోవంటూ సిడ్నీ కమ్లేగర్ డోవ్ అనే అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు
అన్నారు. ‘భారత్ పట్ల ట్రంప్ విధానాలు చూస్తే.. ఎదుటివారిపై కోపంతో మన ముక్కు కోసుకున్నట్లుంది.. బలవంతపు భాగస్వామిగా ఉండటం మనకు నష్టం కలిగిస్తుంది.. వ్యూహాత్మక భాగస్వాముల్ని శత్రువుల చేతుల్లో పెట్టడం ద్వారా నోబెల్ శాంతి బహుమతి దక్కదు.. ఇప్పటికే ఇండియాతో దెబ్బతిన సంబంధాల్ని పునరుద్ధరించుకోవాలి.. అగ్రరాజ్య శ్రేయస్సు, రక్షణ, ప్రపంచ లీడర్ షిప్ కోసమైనా మోదీ సర్కారుతో బంధం దృఢమవ్వాలి..’ అని గుర్తు చేశారు.