ఉగ్రవాదం(Terrorism)పైనే భారత్ పోరాటమని ప్రధాని మోదీ అన్నారు. గత ఏడు దశాబ్దాలుగా టెర్రరిజంపైనే పోరాటం సాగిస్తున్నామని షాంఘై సహకార సదస్సు(SCO)లో స్పష్టం చేశారు. ఈ మధ్య జరిగిన పహల్గామ్ దాడియే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని గుర్తు చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ దానిపై రాజీపడబోమని పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎదుటే తేల్చిచెప్పారు. కష్టకాలంలో భారత్ కు మద్దతునిచ్చిన దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు.