వ్యూహాత్మక(Strategic) దౌత్యంతో భారత్ దూసుకుపోతోంది. 8 రోజులు 5 దేశాలు చుట్టివస్తున్న ప్రధాని.. అర్జెంటీనా వెళ్లడంలో అలాంటి వ్యూహమే ఉంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద గ్యాస్ నిల్వలు, నాలుగో అతిపెద్ద ఆయిల్ నిల్వలకు కేంద్రం అర్జెంటీనా. లిథియం, రాగి మూలకాలూ భారీగా ఉన్నాయి. బొలీవియా, చిలీతోపాటు లిథియం ట్రయాంగిల్ లో అర్జెంటీనా భాగం. ప్రపంచంలోనే అత్యధిక నిల్వలు ఆ దేశంలోనే ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్స్, ల్యాప్ టాప్స్ సహా అన్ని బ్యాటరీల్లో వాడే లిథియానికి భారీ డిమాండ్ ఉంది. ఈ మూలకాన్ని భారత్ రప్పించేందుకే మోదీ తాజా పర్యటన. 57 ఏళ్లలో అర్జెంటీనాకు రెండుసార్లు వెళ్లిన తొలి ప్రధాని మోదీ. G-20 సదస్సు కోసం ఆయన 2018లో ఆ దేశాన్ని సందర్శించారు. లిథియం, చమురు, రక్షణ పెట్టుబడుల కోసం ఆ దేశాధ్యక్షుడు జేవియర్ మిలేతో ఒప్పందం చేసుకుంటున్నారు. https://justpostnews.com