బంగ్లాదేశ్(Bangladesh)లో షేక్ హసీనా రాజీనామా తర్వాత హిందువులపై జరుగుతున్న దాడులు భయంకరంగా తయారయ్యాయి. మైనార్టీలైన హిందువు(Hindu)ల ఆస్తుల ధ్వంసం, మహిళలపై అకృత్యాలు దారుణాతి దారుణంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి ప్రభుత్వ సలహాదారు(Advisor)గా బాధ్యతలు చేపట్టిన మహ్మద్ యూనస్ తో ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు.
మహ్మద్ యూనస్ తనకు ఫోన్ చేసినట్లు ‘X’లో మోదీ ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్య, శాంతి, సుస్థిరతలు ఏర్పడేందుకు భారత్ సహకారం ఉంటుందని, అన్ని వర్గాల మైనార్టీలతోపాటు హిందువులకు రక్షణ కల్పించాల్సిందిగా యూనస్ ను కోరారు.