ప్రపంచంలో అత్యంత(World Most) పవర్ ఫుల్ పాస్ పోర్టుల లిస్ట్ విడుదలైంది. హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారత్ కు 82వ స్థానం దక్కింది. IATA(ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్) డేటా ప్రకారం ర్యాంకింగ్స్ ఇచ్చింది. సెనెగల్(Senegal), తజకిస్థాన్ తో కలిసి భారత్ ఆ స్థానంలో నిలిచింది.
ఆ దేశానిదే టాప్…
195 దేశాలకు వీసా లేకుండా వెళ్లే సింగపూర్ పాస్ పోర్ట్ అత్యంత పవర్ ఫుల్ గా నిలిచింది. 192 దేశాలకు ఫ్రీ జర్నీతో ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, జపాన్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణకొరియా, స్వీడన్ మూడో ప్లేస్ ఆక్రమించాయి. పాకిస్థాన్ 100వ స్థానంలో, అఫ్గానిస్థాన్ అట్టడుగున నిలిచాయి.