బంగ్లాదేశ్ లో కొత్తగా మధ్యంతర(Interim) ప్రభుత్వం ఏర్పాటైంది. నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో కొత్త సర్కారు కొలువుదీరింది. ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్ గా వ్యవహరించే యూనస్ చేత దేశాధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
దేశానికి ఇది మరో స్వాతంత్ర్యమని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నూతన ప్రభుత్వాధినేత కోరారు. దేశ పునర్నిర్మాణానికి విద్యార్థులు అండగా ఉండాలని, వచ్చిన స్వాతంత్ర్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటును భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. కొత్త బాధ్యతల్లో మహ్మద్ యూనస్ రాణిస్తారని, బంగ్లాలో మళ్లీ మునుపటి పరిస్థితులు వస్తాయని మోదీ అన్నారు.