ముంబయి ఉగ్రదాడుల(Terror Attack) మాస్టర్ మైండ్, జమ్మూకశ్మీర్లో పేలుళ్లకు పాల్పడే అబూ ఖతల్ హతమయ్యాడు. లష్కరే తొయిబా కీలక నేత ఖతల్ ను జీలమ్ సింధ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. 2002-03లో పూంఛ్-రాజౌరీ సెక్టార్లో పెద్దయెత్తున దాడులకు పాల్పడ్డట్లు NIA కేసులు నమోదు చేసింది. శివ్ ఖోరీ ఆలయంలో దర్శనం చేసుకుని వస్తుండగా భక్తుల బస్సుపై రియాసీ వద్ద కాల్పులు జరిపిన ఘటనలోనూ అతడి ప్రమేయముంది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, 41 మంది గాయపడ్డారు. లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కు అతడు ప్రధాన అనుచరుడు కాగా ఇతడి హత్యతో ఆ గ్రూప్ కు పెద్ద దెబ్బే.