మయన్మార్ లో భూకంపంతో అపార్ట్మెంట్లన్నీ కుప్పగా మారిపోయాయి. వీటి కింద వేలమంది ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆ దేశంలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 730 మంది గాయపడ్డారు. అటు థాయిలాండ్ లోనూ మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నట్లు ప్రభుత్వం భావిస్తుండగా, మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నాయి. థాయిలాండ్ కు వచ్చి, పోయే విమాన సర్వీసుల్ని రద్దు చేశారు. ఈ భూకంపంలో వేలాది మంది చనిపోయినట్లు అమెరికా జియాలాజికల్ సర్వే(USGS) అంచనా వేసింది. అక్కడ బ్లడ్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని మయన్మార్ మిలిటరీ ప్రభుత్వం తెలిపింది.