
సోషల్ మీడియాపై నిషేధం నేపాల్(Nepal) ప్రభుత్వానికి ప్రాణసంకటంగా మారింది. ఏకంగా ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి రాజీనామా చేయాల్సి వచ్చింది. నిన్న నిరసనకారుల దాడులు అటు పోలీసుల కాల్పుల్లో 25 మంది చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. అయినా తగ్గకపోగా ఈరోజు మంత్రులు, రాజకీయ నేతల ఇళ్లపై దాడులకు దిగారు. ప్రధాని రాజీనామా చేయాలని పొద్దున్నుంచి బీభత్సం సృష్టించి వాహనాలు, ఇళ్లను అగ్నికి ఆహుతి చేశారు. ఫేస్ బుక్, యూట్యూబ్, ఎక్స్(X) సహా 26 ప్లాట్ ఫాంలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తామంటూ సర్కారు దిగొచ్చినా.. ఆందోళనలు తగ్గకపోవడంతో ప్రధాని గద్దె దిగారు.
