
రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్త(Scientist)ల్ని ‘నోబెల్’ ప్రైజ్ వరించింది. నానో టెక్నాలజీకి సంబంధించిన క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణ, దాని అభివృద్ధిపై పరిశోధనలు(Research) జరిపిన ముగ్గురికి సంయుక్తంగా ‘నోబెల్’ అందించనున్నట్లు కమిటీ ప్రకటించింది. అమెరికాకు చెందిన మౌంగి జి. బవెండి(62), లూయిస్ ఈ బ్రూస్(80), అలెక్సీ ఎల్. ఎకిమోవ్(78)కి 2023కు గాను ‘నోబెల్’ ఇస్తున్నట్లు స్వీడన్ లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్ స్టాక్ హోమ్ తెలియజేసింది. ఈ క్వాంటమ్ డాట్స్ ను LED లైట్స్ తోపాటు TV స్క్రీన్ల తయారీలో వాడుతున్నారు. నోబెల్ బహుమతి విజేతలకు మిలియన్ డాలర్ల(రూ.8 కోట్లకు పైగా) ప్రైజ్ మనీ దక్కనుంది.
క్యాన్సర్ ట్యూమర్ కణాలు సైతం
ఈ ముగ్గురు సైంటిస్టులు జరిపిన ప్రయోగాలపై ‘నోబెల్’ కమిటీ పొగడ్తలు కురిపించింది. నానో టెక్నాలజీలో భాగంగా చేపట్టిన క్వాంటమ్ డాట్స్ అనేది ఎలక్ట్రానిక్ పరికరాలకే కాకుండా వైద్య రంగంలోనూ కీలకం కానుంది. క్యాన్సర్ కణజాలాన్ని తొలగించేందుకు గాను డాక్టర్లకు దిశానిర్దేశం చేయడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని కమిటీ తెలియజేసింది.