‘ఆధార్’ కార్డు విధానంపై నోబెల్ బహుమతి(Prize) విజేత పాల్ రోమర్ ప్రశంసలు కురిపించారు. ఇలాంటి సిస్టంను తీసుకురావడంలో పశ్చిమ దేశాలు విఫలమయ్యాయని, భారత్ లాంటి ఆలోచన ఆ దేశాలకు ఎందుకు రావడం లేదో అర్థం కావట్లేదన్నారు. ‘ఆధార్’ను అత్యద్భుత సాంకేతిక(Technology) ఆవిష్కరణ(Innovation)గా అభివర్ణించిన రోమర్.. పేదలకు ప్రభుత్వ సేవలు అందడంలో విప్లవాత్మక మార్పునకు కారణమైందన్నారు.
అమెరికా తరహాలో ప్రైవేటు రంగ సంస్థల గుత్తాధిపత్యంలో కాకుండా భారత ప్రభుత్వం తెచ్చిన ‘ఆధార్’ కార్డు.. న్యాయపరమైన చిక్కులకు సమాధానం చూపిందన్నారు. ఇలాంటి విధానం లేకపోవడం వల్లే పశ్చిమ దేశాల్లో లీగల్ సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. సాహిత్యంలో 2018కి గాను పాల్ రోమర్ నోబెల్ ప్రైజ్ అందుకున్నారు.