జాతీయ భద్రతా సలహాదారు(NSA) అజిత్ దోవల్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin)ను కలిశారు. భారత్ పై అమెరికా 50% సుంకాలు విధించి బెదిరించగా, రష్యాతో బంధాన్ని మరింత పెంచుకునే అడుగులు వేసింది మోదీ సర్కారు. దోవల్ తో చేయి కలిపిన పుతిన్ విజువల్స్ ను క్రెమ్లిన్ నాయకత్వం ప్రకటించింది. రక్షణ, భద్రత, సహకార రంగాల వృద్ధిలో భాగంగా దోవల్.. మంగళవారం రష్యా చేరుకున్నారు. భారత్ పర్యటనకు పుతిన్ వస్తారని ప్రకటించిన కొద్దిసేపటికే ఆయనతో భేటీ జరిగింది. రష్యా అధ్యక్షుడి టూర్ ఈ ఏడాది చివర్లో ఉండే అవకాశముంది.