గాజాకు మానవతా సాయం అందించడంపై ఐక్యరాజ్యసమితి(United Nations) ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ దూరంగా ఉండాలనుకోవడం అవమానకరమని విపక్ష పార్టీలు BJPపై దుమ్మెత్తిపోశాయి. ‘ఐరాస ఓటింగ్ దూరం కావడం నన్ను షాక్ కు గురిచేసింది.. ఇదో పెద్ద అవమానకరం.. పాలస్తీనా అతలాకుతలం అవుతున్నది.. తిండి, నీళ్లు, వైద్యం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న సమయంలో మానవత్వం చూపాల్సిన అవసరం ఉంది.. భారత్ అహింసా సిద్ధాంతానికి ఇది పూర్తి విరుద్ధం’ అంటూ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. అయితే ఆమె కామెంట్స్ పై అధికార BJP గట్టిగానే స్పందించింది. ఉగ్రవాదానికి సంబంధించి ఏ చర్యనైనా సహించేది లేదని, అందుకే ఐరాస తీర్మానానికి దూరంగా ఉన్నట్లు స్పష్టం(Clarity) చేసింది.
ఈ విషయంలో ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నాయంటూ NCP నేత శరద్ పవార్ అన్నారు.
అటు కమ్యూనిస్టు పార్టీలు సైతం మోదీ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. జమాత్-ఎ-ఇస్లామీకి చెందిన యువకులు కేరళలో చేపట్టిన ర్యాలీకి విపక్ష పార్టీలు అటెండ్ కావడంపై కమలం పార్టీ కస్సుబుస్సుమంటున్నది. ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితిల్లోనూ ఉపేక్షించేంది లేదంటూనే ఇలా ర్యాలీలో పాల్గొనడం జాతీయవాదానికి పూర్తి విరుద్ధమని స్పష్టం చేసింది. అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన దాడిని ప్రస్తావించకపోవడాన్ని నిరసిస్తూ ఐరాస తీర్మానానికి దూరంగా ఉండాలని భారత్ నిర్ణయించింది.