భారత్ శక్తిమంతమైన ప్రతీకార చర్య పాకిస్థాన్ ఆర్మీని భయంలోకి నెట్టింది. దూసుకొస్తున్న మిసైళ్లతో కంటోన్మెంట్ల నుంచి సైనికులు పారిపోతున్నారు. సింధ్, పంజాబ్ ప్రావిన్స్ ల్లో 30 కంటోన్మెంట్లుంటే.. అందులో 13 ఖాళీగా మారాయి. సామూహికంగా పారిపోవడం, సైనిక పోస్టుల్ని ఖాళీ చేస్తున్న పరిస్థితి ఉంది. సైన్యంలో లోపించిన నైతిక స్థైర్యాన్ని బట్టి కొన్నేళ్లలో ఇదే అత్యంత దారుణ పతనంగా నిలిచింది. సింధ్(Sindh)లో కరాచీ, క్లిఫ్టన్, ఫైసల్(Faisal), హైదరాబాద్, మాలిర్ వంటివి 13 ఖాళీ అయ్యాయి. పంజాబ్ లోని రావల్పిండి, లాహోర్, సియాల్ కోట్, జీలం, గుజ్రాన్ వాలా, ఒకారా వంటివి 17 ఉండగా, అవి కూడా నిర్జనంగా కనిపిస్తున్నాయి. ఆ దేశం విసిరిన ఒక్క ఆయుధమూ లక్ష్యాన్ని చేరుకోకపోగా.. భారత్ అస్త్రాలు పాక్ ను నట్టేట ముంచుతున్నాయి. దీంతో ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి సైనికులు పలాయనం చిత్తగిస్తున్నారు.