పాకిస్థాన్ పై సైనిక(Military) దాడికి భారత్ సిద్ధంగా ఉందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా మహ్మద్ ఆసిఫ్ అన్నారు. అందుకే తమ బలగాల్ని బలోపేతం చేసినట్లు రాయిటర్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. భారతదేశం దాడి చేసే విషయాన్ని పాకిస్థాన్ సైన్యం తమ సర్కారుకు తెలిపిందన్నారు. అత్యంత అప్రమత్తంగా ఉన్నామన్న ఖవాజా.. తమ ఉనికికి ముప్పు ఏర్పడితే అణ్వాయుధాల్ని ప్రయోగించక తప్పదని హెచ్చరించారు. పహల్గామ్ లో 26 మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్న దుశ్చర్య అనంతరం ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఏ క్షణమైనా తమపై మోదీ సర్కారు దాడికి దిగొచ్చన్న భయంతో పాక్ కాలం గడుపుతున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతుంది.