వక్రబుద్ధిని పాక్ మార్చుకోదు అనడానికి మరో పెద్ద ఉదాహరణ ఇది. జైషే మహ్మద్(JeM) చీఫ్ మౌలానా మసూద్ అజహర్ కు మళ్లీ నిధులు ఇవ్వబోతున్నది. ఈ విషయాన్ని బయటపెట్టిన రక్షణ(Defence) మంత్రి రాజ్ నాథ్ సింగ్.. పాకిస్థాన్ కు వార్నింగ్ ఇచ్చారు. భారత్ జరిపిన దాడుల్లో మసూద్ అజహర్ షెల్టర్ తునాతునకలైంది. ఇప్పుడు దాన్ని పునర్నిర్మించేందుకు రూ.14 కోట్లను షహబాజ్ సర్కారు ఇస్తున్నట్లు రాజ్ నాథ్ గుర్తు చేశారు. పాకిస్థాన్ కు సాయం కింద 2.1 బిలియన్ డాలర్లను IMF కేటాయించింది. ప్రజల నుంచి పన్నుల ద్వారా వసూలు చేస్తున్న డబ్బుతోపాటు IMF నిధుల్ని ఇలా ఉగ్రవాదులకు కేటాయిస్తుండటంపై మంత్రి మండిపడ్డారు.