పాకిస్థాన్ లోని ప్రధాన నగరాలపై భారత అసలు దాడి మొదలైంది. ఉత్తరాది రాష్ట్రాలపై మిసైళ్లు కురిపించి తప్పు చేసిన ఆ దేశానికి ఈ రాత్రి కాళరాత్రే. ప్రధాని షెహబాజ్ షరీఫ్ తోకముడిచారు. అతడి నివాసానికి సమీపంలోనే బాంబులు పడటంతో సేఫ్ జోన్ కు తరలించారు. దేశానికి ఆయువుపట్టయిన కరాచీ పోర్టులో 20 నౌకలు ధ్వంసమయ్యాయి. ఇస్లామాబాద్, కరాచీ, రావల్పిండి, లాహోర్, సియాల్ కోట్ సహా అన్ని ప్రధాన నగరాలపై భారత సైన్యం విరుచుకుపడుతోంది. గత రెండ్రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్న ఆ దేశానికి ఇక తెల్లారడం కష్టమే. భారత్ తో ఎందుకు పెట్టుకున్నామా అని ఆలోచించే టైం కూడా లేనంతగా అన్ని వైపులా దాడులు కొనసాగుతున్నాయి.