సింధు జలాలు పాక్ కు రాకపోతే మరణ మృదంగమేనని ఆ దేశ సెనెటర్(Senator) సయ్యద్ అలీ జఫర్ అన్నారు. భారత్ విసిరిన ‘వాటర్ బాంబ్’తో సర్వనాశనం తప్పదంటూ పాకిస్థాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్(PTI)కు చెందిన ఆయన.. షహబాజ్ సర్కారును సభలోనే హెచ్చరించారు. ఇంకా ఏమన్నారంటే…
‘సింధు బేసిన్ మన జీవితంలో భాగం.. సంక్షోభాన్ని తేల్చకపోతే గొంతులెండి పిట్టల్లా రాలిపోతారు.. మూడో వంతు నీళ్లు బయటనుంచే వస్తున్నాయి.. దేశంలోని ప్రతి 10 మందిలో 9 మంది అంతర్జాతీయ బేసిన్లపైనే బతుకుతున్నారు.. 90% మంది సింధు నీటి పంటలపైనే ఆధారపడుతున్నారు.. విద్యుత్కేంద్రాలు, డ్యాంలన్నీ ఈ నదిపైనే నిర్మించాం.. అందుకే ఈ వాటర్ బాంబ్ సమస్యను తేల్చాలి..’ అంటూ ప్రభుత్వానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.