భారత్ పై దాడికి దిగిన పాకిస్థాన్ కు చావుదెబ్బ తగిలింది. నిన్న లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టంను నాశనం చేసిన భారత్.. ఈరోజు సర్గోధా, ఫైసలాబాద్ లోని రెండు రక్షణ వ్యవస్థల్ని పేల్చేసింది. ఇలా ముప్పేట దాడితో పాక్ సైన్యానికి భారీ నష్టం జరిగింది. మూడు ఫైటర్ జెట్లను కోల్పోయామన్న పాక్.. చాలామంది సైనికులు మరణించారని ప్రకటించింది. తాము యుద్ధం కోరుకోవడం లేదంటూ చావుకబురు చల్లగా చెప్పింది. అఖ్నూర్, జైసల్మేర్ వద్ద ఫైటర్ జెట్లు కూలగా, ఇద్దరు పైలట్లను బందీలుగా పట్టుకుంది భారత్.