ఒకవైపు యుద్ధం(War).. మరోవైపు దివాళా.. ఇదీ పాకిస్థాన్ దుస్థితి. పూట గడవటమే కష్టమైన వేళ అప్పుల కోసం అడుక్కుంటోంది. ప్రపంచ దేశాలు సాయం చేయాలంటూ అభ్యర్థిస్తోంది. రుణం ఇవ్వాలంటూ అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF)కి ఆర్థికశాఖ ట్వీట్ చేసింది. దీనిపై నేటి వాషింగ్టన్ భేటీలో IMF చర్చించనుంది. అయితే ఉగ్రవాదాన్ని పోషించే దేశానికి సాయం చేయొద్దంటూ భారత్ సూచించింది. యుద్ధ భయంతో అక్కడి స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలాయి. 7 బిలియన్ డాలర్లు(రూ.60 వేల కోట్లు) సాయం కావాలని 2024లో IMFను కోరింది. ద్రవ్యోల్బణం, ప్రకృతి విపత్తులు, ఉగ్రవాదం, అంతర్జాతీయ ఒత్తిళ్లతో అక్కడి ఆర్థికవ్యవస్థ పతనమైంది.
ఇక పాక్ అసలు రూపాన్ని బయటపెట్టింది మన విదేశాంగ శాఖ. ఉగ్రవాదుల అంత్యక్రియలకు అక్కడి అధికారులు హాజరైన వీడియోను ప్రపంచ దేశాలకు వివరించింది. ఇటు అరేబియా సముద్రం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేసిన సైన్యం.. అన్ని దేవాలయాలు, పర్యాటక కేంద్రాల్లో బలగాల్ని మోహరించింది. భారత్ దెబ్బకు పాక్ వ్యవస్థలన్నీ ధ్వంసం కావడంతో ఆ దేశం ఛిన్నాభిన్నమైంది.