
విపరీతమైన ప్రజాగ్రహంతో పాకిస్థాన్ ప్రభుత్వానికి తల బొప్పి కట్టింది. ఎడాపెడా పెంచిన పెట్రోలు ధరల్ని ఉన్నట్టుండి తగ్గించింది. రూ.80(పీకేఆర్) తగ్గిస్తూ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించారు. చేసేదిలేక వచ్చే నెలలో ఇస్లామాబాద్ ప్రజలందరికీ ఉచిత రవాణా కల్పిస్తున్నామన్నారు. అక్కడ 42.7% ధరలు పెరిగి రూ.458కి చేరగా, ఈ తగ్గింపుతో ఇప్పుడది రూ.378గా ఉంది. రూ.520గా ఉన్న డీజిల్ ధరను తగ్గించలేదు. ధరల్ని నిరసిస్తూ భారీస్థాయిలో నిరసనలు వచ్చాయి. పెట్రోలు బంకుల్లో పెద్దయెత్తున క్యూలు ఏర్పడి గందరగోళం కనిపించింది. దీంతో దిగొచ్చిన సర్కారు.. ఈ కొత్త రేట్లలో ఒక నెల పాటు ఎలాంటి మార్పులు ఉండవని భరోసా ఇచ్చింది.