ప్రపంచమంతా పహల్గామ్ దాడిని ఖండిస్తే ఆ 2 ఇస్లామిక్ దేశాలు పాక్ కు వంతపాడాయి. అందులో ఒకటి భూకంపంతో అతలాకుతలమైతే ఆదుకుంది భారతే అయినా.. కృతజ్ఞత మరిచింది. భారత్ పై వేసిన 400కు పైగా డ్రోన్లను కూల్చేసిన సైన్యం.. అవన్నీ తుర్కియే(పాత టర్కీ-Turkey)విగా గుర్తించింది. 2023లో భూకంపంతో ఆ దేశం నాశనమైతే.. ‘ఆపరేషన్ దోస్త్’ పేరిట కిసాన్ డ్రోన్లను పంపి ఆహారం సహా భారత్ సాయమందించింది. కానీ తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ కు ముందునుంచీ భారత్ అంటే విపరీతమైన ద్వేషం.
పహల్గామ్ దాడి తర్వాత పాక్ ప్రధాని షెహబాజ్ ను కలిసిన ఆయన.. యుద్ధాన్ని ముందే ఊహించి ఆయుధాలు పంపించారు. సి-130ఈ విమానాల్లో గతనెలలోనే ఆయుధాల్ని పంపిన విషయం గగనతల నిఘా సంస్థలు గుర్తించాయి. అయితే ఇంధనం నింపేందుకే ఆపామని బుకాయించిన తుర్కియే… తర్వాత యుద్ధనౌకను కరాచీ పోర్టుకు పంపింది. పాక్ కు మద్దతిచ్చే ఇస్లామిక్ దేశాలు తుర్కియే, అజర్ బైజాన్ మాత్రమే.