ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా(Quota)ను నిరసిస్తూ బంగ్లాదేశ్ లో మొదలైన అల్లర్లు(Clashes) ఆగేలా కనిపించడం లేదు. మొన్న 200 మంది ప్రాణాలు కోల్పోతే ఈరోజు మరో 72 మంది మృత్యువాత పడ్డారు. అధికార అవామీ లీగ్, ఆందోళనకారుల మధ్య చెలరేగిన ఘర్షణల్లో వందలాది మంది గాయపడ్డారు.
బంగ్లాదేశ్ ఆవిర్భావం కోసం 1971లో జరిగిన యుద్ధంలో పాలుపంచుకున్న మాజీల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ షేక్ హసీనా సర్కారు చట్టం తెచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా గొడవలు మొదలు కాగా ఈ సాయంత్రం వరకు కర్ఫ్యూ విధించింది అక్కడి ప్రభుత్వం.
మరోవైపు బంగ్లా పరిస్థితులపై భారత విదేశాంగ శాఖ దృష్టి పెట్టింది. ఇప్పటికే పలువురు విద్యార్థుల్ని స్వదేశానికి రప్పించిన అధికారులు.. అక్కడ చిక్కుకున్న మరింతమందిని రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.