ట్రంప్ ఫోన్ కాల్స్ ను మోదీ తిరస్కరించడం వెనుక టారిఫ్స్ అని అంతా అనుకుంటున్నారు. కానీ దీని వెనుక పెద్ద కుట్ర ఉందట. ట్రంప్ కాల్స్ ను తరచూ మోదీ తిరస్కరించినట్లు ‘న్యూయార్స్ టైమ్స్’తోపాటు జర్మన్, జపాన్ పత్రికలు రాశాయి. వీరిరువురూ చివరగా మాట్లాడింది జూన్ 17న. కెనడాలోని G7 సమ్మిట్లో భేటీ కావాల్సి ఉన్నా ట్రంప్ అత్యవసరంగా వెళ్లిపోయారు. అమెరికా రమ్మంటూ ఆహ్వానించినా ప్రధాని స్పందించలేదు. ఇందుకు అసలు కారణం.. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తో మోదీని ఫొటో దిగేలా చేయాలన్నదే. వైట్ హౌజ్ లంచ్ కోసం మునీర్ ఆ టైంలో వాషింగ్టన్ లోనే ఉన్నారు. దీన్ని పసిగట్టిన భారత వర్గాలు ఆ అవకాశమివ్వలేదు. మునీర్ తో ప్రధాని ఫొటో దిగితే భారత్-పాక్ యుద్ధాన్ని ట్రంపే ఆపారన్నదానికి బలం లభించేది.