అమెరికా విధించిన సుంకాలతో ఆసియా(Asia) దేశాలన్నీ ఒక్కతాటిపైకి వస్తున్నాయి. చైనాతో కొన్నేళ్లుగా కనిపించిన ఘర్షణ వాతావరణం ప్రస్తుతానికి మాయమైంది. ఇప్పుడా దేశాధ్యక్షుడు జిన్ పింగ్.. మోదీకి స్వాగతం పలకబోతున్నారు. షాంఘై సహకార సంస్థ(SCO) సదస్సుకు ప్రధాని హాజరవుతారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 1 వరకు సదస్సు ఉంటుంది. జిన్ పింగ్-మోదీ గతేడాది రష్యా కజాన్(Kazan)లో భేటీ అయ్యారు. న్యూఢిల్లీ-మాస్కో-బీజింగ్ త్రైపాక్షిక భేటీ త్వరలోనే ఉంటుందని ఇప్పటికే రష్యా ప్రకటించింది. 2025 జనవరి నుంచి అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు భారత్ కూడా జత కలవడంతో షాంఘై సదస్సు కీలకంగా మారనుంది.