చైనా అధ్యక్షుడితోపాటు దేశ ప్రముఖులకే ప్రత్యేకమైన కారు పేరు ‘హాంగ్ కీ L5 లిమోజిన్’. 2019లో ప్రధానితో చర్చల కోసం మహాబలిపురానికి ఇందులోనే జిన్ పింగ్ వచ్చారు. అలాంటి కారును మోదీకి కేటాయించారు.
కారు విశిష్టతలివే…
@ ‘హాంగ్ కీ’ అంటే మాండరిన్ లో ‘రెడ్ ఫ్లాగ్’ అని అర్థం.
@ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫస్ట్ ఆటోమొబైల్ వర్క్స్(FAW) గ్రూప్ చూసుకుంటుంది.
@ 1958లో వచ్చిన ఈ పురాతన కారు ‘మేడిన్ చైనా కల’.
@ కమ్యూనిస్టు నేతల కోసమే ఉద్దేశించిన వీటి ఉత్పత్తిని 1981లో నిలిపేసి 1991లో మళ్లీ ప్రవేశపెట్టారు.
@ 400 హార్స్ పవర్ తో 8.5 సెకన్లలో 100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు.
@ ఆల్-వీల్ డ్రైవ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్లుంటాయి.
@ ధర 7 కోట్లు. మావో జెడాంగ్ కు నచ్చిన ఈ కార్లు 20 ఏళ్లల్లో 1,600 ఉత్పత్తయ్యాయి.