
ప్రభుత్వ నిబంధనలు భారతీయ పౌరుల్ని ఇబ్బంది పెట్టడానికి కాదంటూ ప్రధాని మోదీ ఇండిగో(Indigo) సంస్థపై ఆగ్రహించారు. ‘నియమాలు, నిబంధనలు మంచివి.. వ్యవస్థను మెరుగుపర్చడానికే తప్ప
వేధించడానికి కాదు.. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడటం సర్కారు బాధ్యత..’ అని మోదీ అన్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఎన్నికల సంస్కరణలపై చర్చ జరిగే ముందు NDA సభ్యులు సమావేశమయ్యారు. ఇండిగో తీరును ఈ భేటీలోనే మోదీ ఆగ్రహించారు. దీంతో విమాన సంస్థపై చర్యలుంటాయని ప్రభుత్వం ప్రకటించింది. నష్టనివారణ చర్యల్లో భాగంగా ఇప్పటివరకు రూ.830 కోట్లను ప్రయాణికులకు రీ-ఫండ్ చెల్లించినట్లు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అయితే ఇండిగోకు రూ.37 వేల కోట్ల మార్కెట్ విలువ దెబ్బతిందని గుర్తు చేశారు.