
పాకిస్థాన్ కారాగారాల్లో మగ్గుతున్న భారతీయుల్ని ఆ దేశం విడిచిపెట్టింది. 308 మంది ఖైదీల్ని విడుదల చేస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఆర్డర్స్ కాపీని శనివారం ఇస్లామాబాద్ లోని ఇండియన్ ఎంబసీకి అందజేసింది. విడుదలైన వారిలో 266 మంది ఫిషర్ మెన్ ఉండగా, మిగతా 42 మంది సాధారణ పౌరులని తెలియజేసింది. ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా భారత ఖైదీలను రిలీజ్ చేస్తున్నామంది. రెండు దేశాల మధ్య కుదిరిన 2008 నాటి ఖైదీల అప్పగింత ఒప్పంద కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్డర్స్ లో అక్కడి విదేశాంగ శాఖ వివరించింది.

ఇటువైపు మన జైళ్లల్లో ఉన్న పాక్ ప్రిజనర్స్ లిస్టుని కేంద్ర ప్రభుత్వం… న్యూదిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ కు అందేజేసిందని ఉన్నతాధికారులు తెలిపారు. భారత జైళ్లలో పాక్ కు చెందిన 417 మంది శిక్ష అనుభవిస్తున్నారు. అందులో శిక్షా కాలం పూర్తి చేసుకున్న వారిని విడుదల చేసే అవకాశాలున్నాయి. సముద్రంలో చేపల వేటకు వెళ్లే ఇరుదేశాల ఫిషర్ మెన్ ను… తమ ప్రాదేశిక జలాల్లో ప్రవేశించిన సమయంలో కోస్ట్ గార్డ్ అధికారులు అరెస్టులు చేస్తూ ఉంటారు.