భారత్ ను వ్యతిరేకిస్తూ చైనా అనుకూలవాది(Pro-China)గా పేరుపడ్డ మాల్దీవుల అధ్యక్షుడు(President) మహ్మద్ మయిజ్జు మరోసారి ఆ పదవికి ఎన్నికయ్యారు. 93 స్థానాలు గల మజ్లిస్(పార్లమెంటు)కు ఎన్నికలు జరిగితే మయిజ్జు నేతృత్వంలోని అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 60కి పైగానే గెలుచుకుంది. ఈ పార్టీ మొత్తం 90 స్థానాల్లో బరిలోకి దిగింది. ప్రధాన ప్రతిపక్షమైన మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ(MDP) 12 స్థానాలకే పరిమితమైంది.
భారీ గెలుపు…
ఐదేళ్ల తర్వాత భారీ మెజారిటీతో విజయం సాధించిన అధ్యక్షుడిగా మయిజ్జు నిలిచారు. 2019లో MDP 65 స్థానాలు గెలుచుకుని పెద్దయెత్తున సీట్లు గెలుచుకున్న పార్టీ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంచుకుంది. మాల్దీవుల స్వాతంత్ర్యం(Independence), సార్వభౌమత్వాన్ని కాపాడేది తామేనంటూ ఈ ఎన్నికల్లో మయిజ్జు ఓటర్ల ముందుకెళ్లారు. భారత బలగాల్ని వెనక్కు పంపిస్తున్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసుకోవడం కూడా అతడి విజయానికి కారణంగా నిలిచింది.
వ్యతిరేకత ఇలా…
ప్రధానమంత్రి మోదీ లక్షద్వీప్ లో పర్యటించడం, దీనిపై మాల్దీవుల మంత్రులు తీవ్రంగా విమర్శలు(Criticise) చేస్తూ తమ టూరిజం ముందు భారత్ ఏ మాత్రం బాగుండదంటూ కామెంట్స్ పెట్టడంతో వివాదం ముదిరింది. దీనిపై ‘మాల్దీవుల బాయ్ కాట్’ ఉద్యమం ఊపందుకుంది. భారతీయులు విపరీతంగా సందర్శించడం ద్వారా ఆదాయాన్ని పొందే మాల్దీవులకు.. ఈ బాయ్ కాట్ వల్ల భారీ నష్టం వాటిల్లింది. తాము భారత్ కు మిత్రులమే అంటూ చివరకు మయిజ్జు ప్రకటించినా లాభం కనపడలేదు.