భారతదేశం అమలు చేస్తున్న విదేశీ బ్రాండ్ల ప్రోత్సాహకం అంశం ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే పలు దేశాలు ఈ బాటను అనుసరిస్తుండగా.. అగ్ర రాజ్యాల్లో ఒకటిగా నిలిచే రష్యా సైతం తానూ సై అంటోంది. మోదీ సర్కారు అమలు చేస్తున్న ‘మేకిన్ ఇండియా’పై ప్రశంసలు కురిపించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఆ విధానాలు సక్సెస్ అవుతున్నాయని అన్నారు. భారత్ స్ఫూర్తిగా తమ దేశంలోనూ దేశీయ బ్రాండ్లు, ఉత్పత్తులను ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు.
మనం కాకపోయినా.. మన స్నేహితుడు చేసిన పని సక్సెస్ అవుతుంటే దాన్ని ఫాలో అవడం తప్పేం కాదని పుతిన్ అభిప్రాయపడ్డారు. కొన్నేళ్ల క్రితం అమలులోకి తెచ్చిన ‘మేకిన్ ఇండియా’ ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విజయవంతంగా నడుస్తోంది. దీని ఫలితాలు కొద్ది కాలం నుంచి క్రమంగా బయటపడుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాన్ని ఉదాహరణగా తీసుకోవడం నామోషీ ఏమీ కాదు అంటూ పుతిన్ ప్రస్తావన తెచ్చారు.