బాలిస్టిక్ మిసైల్స్(Missiles)తో ఉక్రెయిన్ పై రష్యా దాడికి పాల్పడటంతో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 300 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ(Zelenskyy) ప్రకటించారు. ఈ రెండు మిసైళ్లు సెంట్రల్ సిటీ పోల్టావాలోని మిలిటరీకి చెందిన విద్యాసంస్థలతోపాటు ఆసుపత్రిపై పడ్డాయి.
రష్యాను ఎదుర్కోవడానికి గగనతల రక్షణ వ్యవస్థలు అందించాల్సిందిగా పశ్చిమ దేశాల్ని జెలెన్ స్కీ కోరారు. మరింత ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు ఆయా దేశాలు సహకారం అందించాలన్నారు.