ఆరు దశాబ్దాల(Six Decades) తర్వాత రష్యా అతిపెద్ద దాడికి దిగింది. ఉక్రెయిన్ పై యుద్ధం సాగిస్తున్న పుతిన్ సర్కారు.. ఈరోజు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్(ICBM) ప్రయోగించింది. ఈ మిస్సైల్ ను ఎప్పుడో 60 ఏళ్ల క్రితం గురిపెట్టగా, తాజాగా ఇప్పుడు బయటకు తీశారు. అణు, రసాయన, బయోలాజికల్ వార్ హెడ్లు మోసుకెళ్లే ICBM 5,500 కిలోమీటర్ల రేంజ్ కు దూసుకెళ్లగలదు. అస్త్రాఖాన్ రీజియన్ నుంచి ప్రయోగించిన ICBM.. వెయ్యి కిలోమీటర్ల దూరంలోని ఉక్రెయిన్ ప్రాంతంపై పడింది.
అణ్వస్త్రాల వినియోగంపై పుతిన్ సంతకం పెట్టిన మరుసటి రోజే ఈ దాడి జరగడం ఆశ్చర్యపరిచింది. MIRV టెక్నాలజీతో తయారైన ICBMను తొలుత అమెరికా తయారు చేసింది. ఆ తర్వాత కొద్దికాలానికే రష్యా ఆ టెక్నాలజీని అందిపుచ్చుకుని దాడికి తయారైంది. అమెరికా-రష్యా కోల్డ్ వార్ తర్వాత ఈ తరహా మిస్సైల్స్ ను పక్కనపెట్టారు. కానీ ఇప్పుడు రష్యా వాటిని ఉక్రెయిన్ పై ప్రయోగించి మళ్లీ పాత రోజుల్ని గుర్తుకుతెచ్చింది.