భారీ సుంకాల(Tariffs)తో భారత్ ను భయపెట్టాలని అమెరికా చూస్తే.. రష్యా మాత్రం తన నమ్మకాన్ని కాపాడుకుంటూనే ఉంది. ఆ దేశ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోమన్ బబుష్కిన్(Babushkin) ఇలా… ‘US మార్కెట్లోకి భారత వస్తువులు వెళ్లకపోతే మా తలుపులు తెరిచి ఘనంగా వెల్ కం చెబుతాం.. ఇది భారత్ కు ఛాలెంజింగ్.. కానీ మా ఇద్దరి స్నేహం ఎంతో బలమైంది.. ఎంతమంది వచ్చినా ఆ బంధాన్ని ఆపలేరు.. మా క్రూడాయిల్ కు భారత్ అతిపెద్ద దిగుమతిదారు.. మేం వారికోసం ఏదైనా చేస్తాం..’ అని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలంటే భారత్ ను బెదిరించడమే ట్రంప్ వ్యూహమని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ చెప్పడంపై రష్యా ఇలా స్పందించింది.