రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్(Ukraine)కు చివరి అవకాశమిచ్చారు. చర్చలతో సమస్య పరిష్కరించుకుంటారా లేక దాడులతో దారికి తెచ్చుకోమంటారా అంటూ అల్టిమేటమిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా చూపిన నిజాయతీతోనే చర్చలకు ఒప్పుకున్నామన్నారు. ‘ముగింపునకు దారులున్నాయి.. అమెరికా జోక్యం ఆశిస్తున్నాం, స్టేట్మెంట్లు కాదు..’ అని చైనాలో అన్నారు. నాటోలో ఉక్రెయిన్ సభ్యత్వాన్ని ఆపడం, డాన్ బాస్ ప్రాంతంపై ఆధిపత్యం వంటి డిమాండ్లను ప్రస్తావించలేదు. ‘జెలెన్ స్కీ మాస్కో వస్తే చర్చిస్తా.. కానీ అవి ఫలించేలా ఉండాలి..’ అని పుతిన్ గుర్తుచేశారు.