ప్రపంచంలో వజ్రాలు(Diamonds) ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో బోట్స్ వానా(Botswana) ఒకటి. అలాంటి దేశంలో మరో భారీ వజ్రం వెలుగుచూసింది. అక్కడి కరోవే గనిలో 2,492 క్యారెట్ల వజ్రం దొరకగా.. ఇది ప్రపంచంలోనే రెండో అతి పెద్దదిగా కెనడా కంపెనీ అయిన లుకారా డైమండ్ కార్పొరేషన్ ప్రకటించింది. దీన్ని గుర్తించడానికి ఎక్స్-రే డిటెన్షన్ టెక్నాలజీని ఉపయోగించినట్లు దేశాధ్యక్షుడు మాక్వీట్సీ మసిసి తెలిపారు.
119 సంవత్సరాల క్రితం 1905లో దక్షిణాఫ్రికాలో వెలికితీసిన 3,106 క్యారెట్ల ‘కల్లినన్’ డైమండే ఇప్పటికీ వరల్డ్ లో అతి పెద్దదిగా ఉంది. ఈ శతాబ్దంలో దొరికిన అతిపెద్దదైన బోట్స్వానా వజ్రం విలువను ప్రకటించాల్సి ఉంది. ఇదే దేశంలో 2016లో దొరికిన అతి చిన్న వజ్రం 63 మిలియన్ డాలర్లు(రూ.550 కోట్లు) పలికింది.