18 రోజుల పాటు రోదసిలో ప్రయోగాలు నిర్వహించిన శుభాంశు శుక్లా బృందం… నింగి నుంచి నేలకు చేరుకుంది. నిన్న అంతరిక్ష కేంద్రం(ISS) నుంచి బయల్దేరిన డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌక.. ఇరవై రెండున్నర గంటల తర్వాత సముద్ర జలాలపై దిగుతుంది. 5.7 కిలోమీటర్ల ఎత్తులో పారాచూట్లు విచ్చుకోగా, 2 కిలోమీటర్ల ఎత్తులో వేగాన్ని తగ్గించి సురక్షితంగా సాగరంపైకి చేర్చాయి. కాలిఫోర్నియా(California) సమీపంలోని సముద్ర తీరంలో క్యాప్సూల్ దిగడంతో శుక్లా కుటుంబ సభ్యులతోపాటు శాస్త్రవేత్తలు, భారతీయులు సంబరాలు చేసుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ శుక్లా.. 1984 రాకేష్ శర్మ యాత్ర తర్వాత స్పేస్ లోకి వెళ్లిన రెండో భారతీయుడిగా రికార్డు సాధించారు.