ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్(powerful)గా సింగపూర్ పాస్ పోర్టు నిలిచింది. ‘హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్’ రిపోర్ట్ లో ఈ ఏడాది టాప్ ప్లేస్ లోకి సింగపూర్ పాస్ పోర్ట్ దూసుకెళ్లింది. ఇప్పటివరకు నంబర్ వన్ గా ఉన్న జపాన్ ను వెనక్కు నెట్టినట్లు లండన్ బేస్డ్(based) ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ అయిన హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ తెలిపింది. ఇది ఉన్నవాళ్లు వీసా లేకుండానే ‘వీసా ఆన్ అరైవల్’ సిస్టమ్ లో ప్రపంచ వ్యాప్తంగా 192 దేశాల్లో పర్యటించవచ్చు. ఐదేళ్ల పాటు టాప్ లో ఉన్న జపాన్ మూడో స్థానానికి పడిపోగా.. జర్మనీ, ఇటలీ, స్పెయిన్ జాయింట్ గా సెకండ్ ప్లేస్ ఆక్రమించాయి. ఈ రిపోర్ట్ లో భారత్ 80వ స్థానం దక్కించుకుంది. గత సంవత్సరంతో పోలిస్తే 5 స్థానాలు మెరుగుపర్చుకుని 85 నుంచి 80వ ర్యాంకుకు చేరుకుంది.
అమెరికా గత దశాబ్దం క్రితం ఒకసారి టాపర్ గా నిలవగా.. ప్రస్తుతం 8వ ర్యాంకులో ఉంది. ఈ ర్యాంకింగ్స్ లో 100వ స్థానంలో పాకిస్థాన్, అట్టడుగు నుంచి మొదటి స్థానంలో అఫ్గానిస్థాన్ నిలిచింది.