అది వందలాది మంది సంచరిస్తున్న షాపింగ్ మాల్(Shopping Mall). అనుకోకుండా ఒకడు పదునైన ఆయుధం(కత్తి)తో అందరిపై దాడికి తెగబడ్డాడు. షాప్ లో పనిచేసే వ్యక్తులు, అక్కడికొచ్చిన కస్టమర్లు(Customers) అనే తేడా లేకుండా విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో మొత్తం తొమ్మిది మందికి గాయాలైతే అందులో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది.
సిడ్నీ సెంటర్లో…
ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరం(Main City) సిడ్నీలోని బోండి జంక్షన్ వద్ద గల ‘సిడ్నీ షాపింగ్ సెంటర్’లో దుండగుడు దాడికి పాల్పడ్డాడు. అయితే గాయపడ్డ వ్యక్తుల్లో ఒకరైన పోలీస్ ఇన్స్ పెక్టర్.. దుండగుణ్ని కాల్చివేసినట్లు న్యూ సౌత్ వేల్స్(New South Wales) అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఆంథోని కుకీ తెలిపారు. మహిళతోపాటు చిన్నారికి కత్తిపోట్లు తగిలాయి.
హాస్పిటల్ కు షిఫ్ట్…
గాయపడ్డవారిని వెంటనే దగ్గర్లోని దవాఖానా(Hospital)కు షిఫ్ట్ చేశారు. పెద్ద కత్తితో అతడు దాడి చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. అయితే ఈ దాడి ఎందుకు జరిగిందన్నది ఇంతవరకు తెలియలేదు. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఆంథోని అల్బనీస్ విచారం వ్యక్తం చేశారు.