భీకర భూకంపం ధాటికి మయన్మార్(Myanmar) అల్లాడిపోయింది. రిక్టర్(Richter) స్కేలుపై తీవ్రత 7.7గా రికార్డయింది. భూకంప కేంద్రం సగాయింగ్ కు 16 కిలోమీటర్ల దూరంలో 10 కి.మీ. లోతులో ఉన్నట్లు జియాలాజికల్ సర్వే తెలిపింది. భారీ భవనాలు పేకమేడల్లా కూలిపోయిన దృశ్యాలు ఒళ్లు జలదరించేలా ఉన్నాయి. హాహాకారాలు చేసుకుంటూ ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ భారీ తీవ్రత ధాటికి భవనాలు 3 నిమిషాల పాటు ఊగిపోయాయి. కుప్పకూలిన భవనంలో 43 మంది ఉన్నట్లు గుర్తించారు. థాయిలాండ్ లో సంభవించిన భూకంపంతో ఎమర్జెన్సీ ప్రకటించారు ప్రధాని షినవ్రత. మయన్మార్ లో 12 నిమిషాల వ్యవధిలోనే రెండు ప్రకంపనలు వచ్చాయి. అటు బంగ్లాదేశ్ సైతం భూకంపానికి వణికిపోగా, భారత్ లోని కోల్ కతా, మేఘాలయాల్లో ప్రకంపనలు వచ్చాయి.