అమెరికా ఎన్నికలను శాసించి ‘స్వింగ్’గా భావించే ఏడు రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాలను ఖాతాలో వేసుకున్న డొనాల్డ్ ట్రంప్.. మరో నాలుగింటిలోనూ తిరుగులేని ఆధిక్యంతో అధ్యక్షుడిగా పీఠం ఎక్కబోతున్నారు. 47వ అధ్యక్షుడిగా జనవరి 20న ఆయన బాధ్యతలు చేపడతారు. ఏడు స్వింగ్ రాష్ట్రాలైన జార్జియా, వియ్కాన్సిన్, నార్త్ కరోలినా, మిషిగాన్, పెన్సిల్వేనియా అరిజోనాలో రిపబ్లికన్లకు తిరుగులేకుండా పోయింది. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ తొలుత 3 రాష్ట్రాల్లో లీడ్ లో ఉన్నా ఆ తర్వాత ఆధిక్యం క్రమంగా చేజారింది.
దేశంలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లుండగా.. 270 ఓట్లు సాధించిన అభ్యర్థి అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. ఇప్పటివరకు వెలువడ్డ ఫలితాల్లో(Results) 280 ఓట్లతో మ్యాజిక్ ఫిగర్ సులువుగా దాటిన ట్రంప్.. అమెరికాకు ఇది స్వర్ణయుగమని అన్నారు. అటు కమల మాత్రం 224 ఓట్లు దక్కించుకున్నారు.