తిరుగుబాటుదారుల(Rebels) అంతర్యుద్ధంతో దేశం విడిచి పారిపోయిన సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనపై విష ప్రయోగం(Poisoned) జరిగినట్లు మాస్కో వర్గాలు తెలిపాయి. సిరియా నుంచి తన కుటుంబంతో సహా రష్యాకు శరణార్థిగా వెళ్లిన ఆయనకు.. పుతిన్ సర్కారు అండగా నిలిచింది. ప్రస్తుతం ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డట్లేనని మీడియా కథనాలు చెబుతున్నాయి. పదకొండేళ్ల క్రితం సిరియాలో నిశ్శబ్దంగా మొదలైన ఉద్యమం అంతర్యుద్ధంగా మారింది. ఇరువర్గాల ఘర్షణల్లో లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది దేశం విడిచిపెట్టారు.
అవినీతి, నిరుద్యోగం, బషర్ ఒంటెద్దు పోకడలు, నిరంకుశత్వాన్ని నిరసిస్తూ ప్రజలు పోరుబాట పట్టారు. అధ్యక్షుడు దేశం విడిచిపెట్టగానే ఆయన ఆస్తుల్ని ధ్వంసం చేశారు. ఈ ఆందోళనల్లోకి అల్ ఖైదా, ఐసిస్ చేరడంతో పరిస్థితి బీభత్సంగా తయారైంది. 2011 నుంచి 2021 వరకు దశాబ్ద కాలంలో 3.5 లక్షల మంది మృతిచెంది ఉంటారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. అలా దేశం విడిచి పారిపోయిన అసద్ పై హత్యాయత్నం జరిగింది.