ప్రపంచమంతా రష్యాను దూరం పెడితే ఆ దేశంతో వాణిజ్యం కొనసాగిస్తోందంటూ భారత్ పై ట్రంప్ సుంకాలు విధించారు. 25% టారిఫ్స్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. భారత్ తమ మిత్రదేశమే అయినా ఆ దేశంతో పెద్దగా వాణిజ్యం(Trade) జరపడం లేదని అమెరికా అధ్యక్షుడు స్పష్టతనిచ్చారు. అధిక సుంకాలు విధించడం వల్లే మోదీ ప్రభుత్వంతో వ్యాపారాలు జరపట్లేదన్నారు. రష్యాతో చమురు(Fuel) వ్యాపారం సరికాదని, వెంటనే ఆపాలన్నారు.