బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న దాడులు జైళ్ల(Jails)కు పాకాయి. భారత సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో గల ఢాకా షెర్పూర్ జైలుపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 518 మంది ఖైదీలు తప్పించుకోగా, అందులో 20 మంది నిషేధిత సంస్థ JMBకి చెందిన కరడుగట్టిన తీవ్రవాదులు(Terrorists)న్నారు. బంగ్లా నుంచి మన సరిహద్దుల్లోకి చొరబడే అవకాశమున్నందున BSF భారీ నిఘాను ఏర్పాటు చేసింది.
ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం నుంచి పారిపోయి వచ్చిన షేక్ హసీనా.. భారత్ లోనే తలదాచుకుంటున్నారు. నిన్న ఆమె వచ్చిన C130J ఎయిర్ క్రాఫ్ట్ హిండన్ ఎయిర్ బేస్ నుంచి తిరిగి బంగ్లాదేశ్ వైపు పయనించింది. కానీ అందులో హసీనా లేరు. ఆమె లండన్ ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్నా అక్కణ్నుంచి ఇంకా అనుమతి రాలేదు.
ఆమె విడుదల…!
ఇక జైలు జీవితం గడుపుతున్న మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా కారాగార విముక్తి పొందుతున్నారు. ఆమె విడుదలకు సైన్యం ఆదేశాలివ్వడంతో.. తదుపరి PMగా ఆమెనే బాధ్యతలు చేపట్టే ఛాన్సెస్ ఉన్నాయి. బంగ్లా నేషనలిస్ట్ పార్టీ(BNP) నేత ఖలీదా జియాపై.. హసీనా సర్కారు అక్రమాస్తుల కేసులు పెట్టడంతో 17 ఏళ్ల శిక్ష పడింది.