ప్రపంచ అపర కుబేరుడు(World Richest) ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ప్రధానమంత్రి మోదీతో ఆయన భేటీ(Meet) కావాల్సి ఉండగా దాన్ని వాయిదా( Postpone) వేసినట్లు తన సోషల్ మీడియా ‘X’లో తెలిపారు. భారత్ లో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టేందుకు టెస్లా అధినేత.. ప్రధాని మోదీతో మీట్ ఇంతకుముందే అవుతానని చెప్పారు. అయితే ఇప్పటికీ ఈ సమావేశం కోసం ఎదురుచూస్తూనే ఉన్నానన్నారు.
బిజీ టెస్లా…
టెస్లాకు సంబంధించిన పనుల్లో బాగా బిజీగా ఉన్నందున ముందుగా అనుకున్న షెడ్యూల్(Schedule) ప్రకారం భారత్ కు రాలేకపోతున్నానని ఎలాన్ మస్క్(Elon Musk) వివరించారు. కానీ కచ్చితంగా ఈ సంవత్సరం అక్కడ అడుగుపెడతానని క్లారిటీ ఇచ్చారు. టెస్లా కార్లకు సంబంధించి 2-3 బిలియన్ డాలర్లు(రూ.1.65-2.5 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది.
పెట్టుబడులివే…
భారత్ లోనే టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్లను ప్రారంభించడం, ఎంట్రీ లెవెల్ అయిన రూ.25 లక్షలతో కూడిన మోడల్-2 కార్లను ప్రవేశపెట్టాలన్నది మస్క్ ఆలోచన. దీంతోపాటు అతడి స్టార్ లింక్ శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులకు సంబంధించి భారత అంతరిక్ష రంగంలోనూ పెట్టుబడులు(Investments) పెట్టేందుకు మస్క్ ఆసక్తితో ఉన్నారు. అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ద్వారాలు తెరిచింది.