వెయ్యేళ్ల నాటి ఆలయం(Temple) కోసం రెండు దేశాల మధ్య యుద్ధం(War) భీకరంగా మారింది. ఈ దాడుల్లో పలువురు మృతిచెందారు. థాయిలాండ్, కంబోడియా సరిహద్దుల్లోని 11వ శతాబ్దపు హిందూ ఆలయం కోసం ఘర్షణ మొదలైంది. ఎమరాల్డ్ ట్రయాంగిల్ ప్రాంతంలో థాయ్ దళాల ఘర్షణలో కంబోడియా సైనికుడు మే నెలలో మరణించాడు. ఆ మాటల యుద్ధం కాస్తా రణంగా మారింది. ఈ రెండింటి మధ్య 500 మైళ్లకు పైగా సరిహద్దు ఉండగా, ప్రీహ్ విహార్ సహా ఇతర ఆలయాల కోసం ఇప్పుడు పోరాటం జరుగుతోంది. ఈ అంశంపైనే థాయ్ ప్రధాని షినవత్రా పదవి పోయింది. https://justpostnews.com
శత్రుదేశ మాజీ ప్రధానితో మాట్లాడిన ఆమె.. థాయ్ ఆర్మీ కమాండర్ తనకు వ్యతిరేకంగా ఉన్నారు ‘అంకుల్’ అంటూ సంబోధించింది. ఇది లీకై.. శత్రువుతో చర్చలా అంటూ ఆ దేశంలోనే దుమారం రేగి పదవి పోయింది. ఇప్పుడు థాయ్ సేన F-16 విమానాలతో, కంబోడియా శతఘ్నులతో దాడులు చేసుకుంటున్నాయి. ఈ ఆలయం కంబోడియాకు చెందుతుందని 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పునిచ్చింది. దాన్ని థాయ్ ఒప్పుకున్నా.. 2008లో యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు రావడాన్ని అంగీకరించలేదు.