టోర్నడో(Tornadoes) తుపాను మధ్య అమెరికాను అతలాకుతలం చేసింది. బలమైన గాలులకు ఇళ్లు నేలమట్టమై 33 మంది ప్రాణాలు విడిచారు. లక్షలాది వాహనాలు కొట్టుకుపోగా, కాన్సాస్(Kansas), మిస్సోరీ, టెక్సాస్, అర్కాన్సాస్, మిసిసిప్పీలో తీవ్రత ఎక్కువగా ఉంది. చెట్లు కూలి, కరెంట్ లేక అంధకారంలో చిక్కుకున్నారు. పలు రాష్ట్రాల్లో పరిస్థితి విషమించడంతో ఎమర్జెన్సీ ప్రకటించారు. మరిన్ని టోర్నడోలు రాబోతున్నాయని వాతావరణ శాఖ చెప్పడంతో ట్రంప్ సర్కారు అలర్ట్ అయింది. శనివారం రాత్రి నుంచి 2 లక్షల ఇళ్లకు కరెంట్ నిలిచిపోయింది. తుపాను తీరాన్ని తాకే సమయంలో బలంగా వీస్తున్న గాలుల వల్ల ప్రజలు ఆందోళనతో కాలం గడుపుతున్నారు.